![]() |
![]() |
.webp)
జీవితంలో ప్రతీ మనిషి కొన్ని భిన్నమైన పరిస్థితులని ఎదుర్కుంటాడు. అయితే వాటిల్లో ప్రేమ, పెళ్ళి అనేవి ప్రతీ ఒక్కరిలో ముఖ్యమైనవిగా ఉన్నాయి. అందులో ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని బిగ్ బాస్ ఫేమ్ గీతు రాయల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది.
గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు నాగార్జున.
గీతు రాయల్ కి ఇన్ స్టాగ్రామ్ లో 674K ఫాలోవర్స్ ఉన్నారు. బిగ్ బాస్ తో ఫేమస్ అయిన గీతు రాయల్.. ఆ తర్వాత ఫాలోయింగ్ ని పెంచుకుంది. రెగ్యులర్ గా వ్లాగ్స్, రీల్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో భార్యాభర్తలకి, లవర్స్ కి ఓ టిప్ ఇచ్చింది గీతు. "ఒక రోజు మీతో మాట్లాడకపోతే వాళ్ళ రోజే గడవదు అన్న ఇంపార్టెన్స్ ఇచ్చి, ఒకరోజు మీరు బ్రతికి ఉన్నారా లేదా అన్నది కూడా పట్టించుకోకపోతే.. ఆ ఫీలింగ్ తట్టుకోలేం రా నాయన " అని గీతు రాయల్ చెప్పుకొచ్చింది. ఇలా ఎవరి సిచువేషన్ ఎలా ఉంటుందో తెలియదు.. ఉన్నన్ని రోజులు నీకు నచ్చింది చేయాలని చెప్తూ అదే ఫాలో అవుతుంటుంది గీతు రాయల్. మరి ఇన్ స్టాగ్రామ్ లో తను చేసిన ఈ పోస్ట్ ని చూశారా కామెంట్ చేయండి.
![]() |
![]() |